Priyadarshi: నా జాతకం చూసి నటుడిని కానన్నారు
ఓ వైపు సపోర్టింగ్ యాక్టర్ గా, మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ప్రియదర్శి(Priyadarshi). ఇటీవల కోర్టు(Court) సినిమాతో ఆడియన్స్ ను పలకరించి ఆ సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న ప్రియదర్శి ఇప్పుడు మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohanakrishna Indraganti) దర్శకత్వంలో సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) సినిమా చేశాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియదర్శి పలు విషయాలను వెల్లడించాడు. జాతకాల పిచ్చోడి కథగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతకాలను నమ్మమని కానీ, నమ్మొద్దని కానీ తాము చెప్పడం లేదని, కానీ ఒకరి నమ్మకాలను మరొకరిపై రుద్దితే ఆ పరిణామాలు, దాని తీవ్రత ఎలా ఉంటుందనేది మాత్రమే సినిమాలో చూపించామని చెప్పాడు ప్రియదర్శి.
సినిమాలో చూపించనంత కాదు కానీ తాను కూడా రియల్ లైఫ్ లో జాతకాలను నమ్ముతానని, ఇండస్ట్రీలోకి రాకముందు తన జాతకాన్ని చూపించగా, తానసలు యాక్టర్ ను అవనని చెప్పారని, అది విని ఎంతో బాధ పడ్డానని చెప్పిన ప్రియదర్శి తన టాలెంట్ ను నమ్ముకుని సినిమాల్లోకి వచ్చానని, వర్క్ ను నమ్మే జర్నీని కంటిన్యూ చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్ లో ఉండదనే విషయాన్ని తర్వాత తెలుసుకున్నానని ప్రియదర్శి వెల్లడించాడు.






