Priya Prakash Warrior: మినీ స్కర్ట్ లో వింక్ బ్యూటీ

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Warrior) గురంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒరు అదార్ లవ్(Oru Adhar Love) సినిమాలో కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ కు ఆ సినిమా తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ అదృష్టం కలిసిరాక అవి సక్సెస్ అవలేకపోయాయి. సినిమాల్లో సక్సెస్ అవలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే అమ్మడు తాజాగా బీచ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రియా మినీ స్టర్క్ ధరించి, బికినీ మాదిరిగా ఉన్న ఔట్‌ఫిట్ లో అందరినీ అలరించింది. ఆకట్టుకునే అందంతో పాటూ స్టైలిష్ గా ఫోటోలకు పోజులిస్తూ స్కిన్ షో చేసింది. ప్రియా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.