మెగా ఆఫర్ కు ప్రియ వారియర్ సారీ?
సోషల్ మీడియాతో దేశ వ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్షేషన్‌గా మారిన వారిలో మలయాళం ముద్గుగుమ్మ ప్రియా వారియర్ కూడా ఉంది. ఒరు ఆధార్ లవ్ సినిమాలో మాణిక్య మలరాయ పూవి అనే పాట వీడియాలో ప్రియా కన్నుగీటడం, ఆ వీడియో కాస్త మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడంతో ప్రియాకు డిమాండ్ పెరిగింది. యూత్‌లో ప్రియాకు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆమెకు 6 మిలియన్స్ ఫాలోయింగ్ వుందంటే ఆమె క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రియా ఒక తెలుగు సినిమా ఆఫర్‌కు నో చెప్పిందట. మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్గా తీసుకునేందుకు ప్రియాను సంప్రదించారట. కానీ ఆమె ఆ ఆఫర్‌ను ఒప్పుకోలేదని సమాచారం. ఆమెకు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా చేయాలని ఉందని, అందుకే రెమ్యూనరేషన్ భారీగానే చెబుతోందని అంటున్నారు. గతంలో కూడా దిల్ రాజు బ్యానర్లో మీడియం రేంజ్ సినిమాలకు ఆఫర్ ఇస్తే ఇలానే చేసిందట.













