అంధాధున్ కి వారిద్దరే మైనస్ గా మారేనా?
బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ అంధాధున్ ను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో యంగ్ హీరో నితిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు. టబు చేసిన పాత్ర కోసం తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్ తో చేయించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రీమేక్ లో కాస్టింగ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంటే, తమిళంలో కాస్టింగ్ మాత్రం సినిమాపై అసలు ఇంట్రస్టే లేకుండా చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.
అంధాధున్ ఒరిజినల్ లో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు.యంగ్ హీరోగా ఆయన కనబరిచిన ప్రతిభకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అలాంటిది తమిళంలో ఆ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరో ప్రశాంత్ చేస్తున్నాడంటూ వార్తలు రావడంతో అప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా ప్రియా ఆనంద్ ను సెలెక్ట్ చేశారు. అప్పుడెప్పుడో మెరిసిన ప్రియా ఆనంద్ ను ఇప్పుడు ఈ సినిమాలో తీసుకోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. దీంతో అంధాధున్ రీమేక్ కు హీరో హీరోయిన్లు ఇద్దరి వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని తెలుస్తుంది.













