Prithviraj Sukumaran: మలయాళ పరిశ్రమపై పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు
నటుడిగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే, ఇంకో వైపు డైరెక్టర్ గా కూడా సినిమాలను తీస్తున్నాడు మలయాళ స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran). సలార్(Salaar) లో ప్రభాస్(Prabhas) ఫ్రెండ్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మరింత చేరువ అయ్యాడు. అంతేకాదు, భవిష్యత్తులో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేస్తానని పృథ్వీ ఆల్రెడీ మాట కూడా ఇచ్చాడు.
ఇదిలా ఉంటే లూసీఫర్(Lucifer) సినిమాకు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan) అనే సినిమాను తీసిన పృథ్వీ రాజ్ దాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ మలయాళ పరిశ్రమ గురించి కామెంట్స్ చేశాడు. మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ కు కలెక్షన్స్ చాలా ప్రధానమన్నాడు. మలయాళంలో సినిమాలకు లాభాలు రావడానికి చాలా ఒత్తిడి ఉంటుందని, అంత ఒత్తిడిలో కూడా మలయాళం నుంచి చాలా గొప్ప సినిమాలొస్తున్నాయని ఆయన అన్నాడు.
మంచి కథతో సినిమా తీయకపోతే వాటికి సరైన ఆదరణ దక్కదని ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఆడియన్స్ నిరూపించారని, గత కొంతకాలంగా ప్రేక్షకులు సినిమాలో నటీనటులెవరు? డైరెక్టర్ ఎవరనేది పట్టించుకోకుండా మంచి కంటెంట్ తో వస్తే ఆదరిస్తున్నారని, ఆ నమ్మకం తనకుందని పృథ్వీరాజ్ చెప్పారు.













