Prithviraj Sukumaran: ప్రభాస్ పంపే మటన్ అంటే చాలా ఇష్టం
ప్రభాస్(Prabhas) బయట ఎంత సింపుల్ గా ఉంటాడో అతిథులకు మర్యాదలు చేయడంలో అంత యాక్టివ్ గా ఉంటాడు. భోజనప్రియుడైన ప్రభాస్, హైదరాబాద్ వచ్చిన తన కో యాక్టర్లకు కూడా భోజనం పంపిస్తూ వారికి మర్యాదలు చేస్తుంటాడు. అందుకే ప్రభాస్‌కే కాదు, ఆయన ఇంటి భోజనానికి కూడా అందరూ ఫిదా అవుతుంటారు.
ప్రభాస్ తో సలార్(Salaar) మూవీలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇంటి ఫుడ్ గురించి మాట్లాడారు. సలార్ సినిమా షూటింగ్ టైమ్ లో ప్రభాస్ ఇంటి నుంచి తనకు పలుమార్లు ఫుడ్ వచ్చిందని, అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పిన పృథ్వీరాజ్, ప్రభాస్ పంపిన మటన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
మటన్ తో చేసిన వంట రుచి తనకు బాగా నచ్చిందని చెప్పిన పృథ్వీరాజ్, ప్రభాస్ అతిథులను గౌరవించే విధానం చాలా గొప్పగా ఉంటుందని పొగిడాడు. పృథ్వీరాజ్ ప్రభాస్ ఇంటి భోజనం గురించి చేసిన ఈ కామెంట్స్ ను ఆయన ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. సలార్ తర్వాత నుంచి ప్రభాస్ కు, పృథ్వీరాజ్ కు మధ్య మంచి స్నేహం ఏర్పడిన విషయం తెలిసిందే.













