Prithviraj Sukumaran: అలాంటి వీడియోల కోసం ఎందుకు ఎగబడతారో అర్థం కాదు
రాజమౌళి(Rajamouli)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దేన్నైనా టైమ్ వచ్చే వరకు రివీల్ చేయడు. ఏ విషయాన్నైనా సరైన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేసి మ్యాటర్ ను రివీల్ చేసి సినిమాపై హైప్ పెంచే జక్కన్న అసలు సినిమాను అనౌన్స్ చేసే కంటే ముందే ఎస్ఎస్ఎంబీ29 నుంచి ఓ వీడియో లీకైంది.
లీకైన వీడియో కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరలైంది. రీసెంట్ గా ఎల్2: ఎంపురాన్(L2: Empuraan) ప్రమోషన్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కు ఈ లీకులపై ప్రశ్న ఎదురైంది. దానికి పృథ్వీరాజ్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపచేస్తుంది. అసలు లీకైన వీడియోలు చూడ్డానికి ఆడియన్స్ ఎందుకు ఎగబడతారో అర్థం కావడం లేదన్నాడు.
లీకైన వీడియోలో ఉన్న గొప్పేంటో తనకు అర్థం కావడం లేదని, అలాంటి వీడియోలు చూసి మీ అనుభవాన్ని మీరే చంపుకున్నట్టు అవుతుందని తెలివిగా చెప్పాడు పృథ్వీరాజ్. అయితే పృథ్వీరాజ్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమే. లీకైన వీడియోలకు ఎలాంటి సీజీ కానీ, బీజీఎం కానీ ఉండకపోవడంతో ఆ సీన్ లో ఎలాంటి ఇంటెన్సిటీ ఉండదు. అయితే ఎవరెన్ని చెప్పినా లీకైన వీడియోలను మాత్రం ఎవరూ వైరల్ చేయకుండా ఆపలేకపోతున్నారు. రాజమౌళి సినిమాలో పని చేసిన అనుభవాన్ని అడగ్గా, తాను సంవత్సరం ముందు నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నానని పృథ్వీరాజ్ చెప్పాడు.













