Prithviraj Sukumaran: రజినీతో ఛాన్స్ మిస్ చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్
నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) డైరెక్టర్ గా కూడా సినిమాలను రూపొందిస్తున్నాడు. సలార్(Salaar) సినిమాలో కీలకపాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన పృథ్వీరాజ్ ఫ్యూచర్లో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మోహన్‌లాల్(Mohanlal) తో ఆయన చేసిన లూసీఫర్(Lucifer) ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు లూసీఫర్ కు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్(L2:empuraan) అనే సినిమాను తీసిన పృథ్వీరాజ్ మార్చి 27న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొన్నాళ్ల కిందట లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) రజినీతో సినిమా కోసం తనని సంప్రదించినట్టు చెప్పాడ పృథ్వీరాజ్.
అయితే రజినీతో సినిమా చేసే టైమ్ లో మరెవరితో సినిమా చేయొద్దని లైకా వాళ్లు కండిషన్ పెట్టారని, దానికి ఒప్పుకుని కథ రెడీ చేయాలని వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ వారిచ్చిన టైమ్ కు స్టోరీ రెడీ చేయలేకపోవడం, మరికొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలవకుండానే క్యాన్సిల్ అయిందని, అలా రజినీతో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయినట్టు చెప్పిన పృథ్వీరాజ్ ఫ్యూచర్ లో కచ్ఛితంగా సూపర్ స్టార్ తో సినిమా చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.













