Prithviraj Sukumaran: సలార్2కు హైప్ పెంచిన పృథ్వీరాజ్ సుకుమారన్
ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో వచ్చిన సలార్(Salaar) సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ కు ప్రత్యేక ఫాన్ బేస్ ఉంది. సలార్ సినిమా రెండు భాగాలుగా రానుండగా రెండో భాగంపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఇండియన్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా రానున్న సలార్2(Salaar2) పై మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా సర్జమీన్(Sarmeen) ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ సలార్2 గురించి మాట్లాడారు. సలార్ సీక్వెల్ గా రానున్న సలార్2 మొదటి భాగం కంటే చాలా పెద్దగా, గ్రాండ్ గా ఉండనుందన్నారు.
ప్రభాస్(Prabhas) తో కలిసి ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై తలపడతానా అని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని అంటోన్న పృథ్వీరాజ్ సుకుమారన్, సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ అనే పాత్రలో కనిపించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే సలార్2 పై ఆడియన్స్ కు మంచి అంచనాలుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.







