Prithviraj Sukumaran: దేశభక్తికి అసలైన అర్థం అదే!

సినీ సెలబ్రిటీలకు కూడా అందరిలానే దేశభక్తి ఉంటుంది. అయితే వారు దాన్ని తమ తమ సినిమాల ద్వారా చూపిస్తూ ఉంటారు. దేశభక్తికి సంబంధించిన సినిమాలను తీస్తూ దేశంపై ప్రేమను బయట పెడుతుంటారు. ఇప్పుడు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కూడా తన దేశభక్తిని బయటపెట్టాడు. ఆయన నటించిన సర్జమీన్(Sarjameen) జులై 25న రిలీజ్ కానుంది.
కాజోల్(kajol), ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) కీలక పాత్రల్లో నటిస్తున్న సర్జమీన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన పృథ్వీరాజ్ దేశభక్తి గురించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మీరెక్కడినుంచి వచ్చారని అడిగినప్పుడు తాను తన ఊరి పేరు కాకుండా భారత్ నుంచి వచ్చానని చెప్తానని అన్నాడు.
అలా దేశం పేరు చెప్పడంలో ఓ గర్వముందని, అదే మన దేశంపై మనకున్న ప్రేమకు గుర్తని చెప్పిన ఆయన మనం ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లమైనా, ఏ భాషకు సంబంధించిన వాళ్లమైనా అన్నింటికంటే ముందు భారతీయులమని గుర్తు పెట్టుకోవాలని, మంన ఏం చేసినా, ఎక్కడున్నా మన దేశాన్ని గుర్తు పెట్టుకోవాలని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు.