PrithviRaj Sukumaran: రజినీని దృష్టిలో పెట్టుకునే ఆ సీన్ రాసుకున్నా
మోహన్ లాల్(Mohan lal) హీరోగా పృథ్వీరాజ్(Prithvi Raj) దర్శకత్వంలో వచ్చిన లూసీఫర్(Lucifer) భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా ఎల్2: ఎంపురాన్(L2: Empuraan) తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ లూసీఫర్ లోని ఓ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
లూసీఫర్ లో మోహన్ లాల్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచిందన్నది అందరికీ తెలుసు. ఆ సీన్ ను తాను సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ను స్పూర్తితో తీసుకుని రాసుకున్నట్టు పృథ్వీరాజ్ చెప్పారు. చెన్నైలో రజినీ ఉండే ఏరియాలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులుంటాయో తాను ఓ వార్త చదివానని, అది చదివాక దాన్ని ఆధారంగా చేససుకునే మోహన్ లాల్ ఎంట్రీ సీన్ ను రాసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
లూసీఫర్ లో ఆ సీన్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పిన పృథ్వీరాజ్ రియల్ లైఫ్ లో రజినీకి ఎంతో పెద్ద ఫ్యాన్ అన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఎల్2: ఎంపురాన్ ట్రైలర్ ను కూడా పృథ్వీరాజ్ ముందుగా రజినీకే చూపించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని, ట్రైలర్ చూశాక రజినీ చెప్పిన మాటల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని పృథ్వీ ట్వీట్ కూడా చేశాడు. రజినీని డైరెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్న పృథ్వీకి గతంలో ఓసారి ఆ ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని పృథ్వీ అన్నారు.













