వాయిదా కోసం ఊరు పేరు భైరవకోనపై ప్రెజర్
సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు తమకు సోలో రిలీజ్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఈగల్ నిర్మాతలు చేస్తున్న డిమాండ్ క్లైమాక్స్ వచ్చేలా ఉంది. ఫిబ్రవరి 9న ఈగల్ కు రిలీజ్ డేట్ ఇచ్చారు. అదే రోజున ఊరు పేరు భైరవకోన, యాత్ర2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో యాత్ర2 పోస్ట్ పోన్ చేయడం కుదరదని, రాజకీయాలతో ముడిపడిన సినిమా కాబట్టి ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎలక్షన్ కోడ్ అమలైతే సినిమా మూడు నాలుగు నెలల వరకు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి యాత్ర2కు మినహాయింపు దొరికింది.
ఇక ఈగల్ కు ఉన్న సమస్యల్లా ఊరు పేరు భైరవకోన సినిమాతోనే. ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయించాలని ఛాంబర్ పెద్దలు చూస్తున్నారట. మొన్న హనుమాన్ ను తక్కువ అంచనా వేసి మిగిలిన సినిమాలు చాలానే నష్టపోవడం దగ్గరనుంచి చూసిన ఈగల్ నిర్మాతలు, ఊరు పేరు భైరవకోన సినిమా విషయంలో భయపడుతున్నారు.
దానికి తోడు ట్రైలర్ రిలీజయ్యాక సినిమాకు బజ్ బాగా పెరిగింది. సాంగ్స్ కూడా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యాయి. డైరెక్టర్ విఐ ఆనంద్ ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ నమ్ముతున్నారు. కంటెంట్ బాగుంటే ఈ సినిమా కూడా విరూపాక్షలా సంచలనం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ సినిమాను వాయిదా వేసుకోవాలని ఆ నిర్మాతలను ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ కోరుతున్నారట.
కానీ ఎప్పుడో లాక్ చేసుకున్న సినిమా రిలీజ్ ను ఇప్పుడు పోస్ట్ పోన్ చేయమనడం ఎంతవరకు కరెక్టని ఊరు పేరు భైరవకోన నిర్మాతలు ప్రశ్నిస్తున్నారట. దానికి తోడు ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేసుకుంటే తర్వాత మరో డేట్ దొరకాలంటే చాలా నెలలు వరకు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ దేవర పోస్ట్ పోన్ అయినా సరే ఆ డేట్ కు ఫ్యామిలీ స్టార్, టిల్లూ స్వ్కేర్ లైన్ లో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన తమ సినిమాను వాయిదా వేసుకుంటుందా? లేదా అన్నది చూడాలి.













