Prerna: రష్మిక కలవడం మానేసింది

ఇండస్ట్రీకి వచ్చాక నటీనటులెవరికైనా వారి జీవితం మొత్తం మారడం ఖాయం. ఇంతకు ముందులా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి టైమ్ కేటాయించలేరు. యాక్టర్లుగా మారాక వారి లైఫ్ మొత్తం మారిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు కావాలనుకున్నది చేయలేరు. కానీ కొంతమంది మాత్రం పర్సనల్ లైఫ్ తో పాటూ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా త్యాగం చేయాల్సి వస్తుంది.
అసలు విషయానికొస్తే కృష్ణ ముకుంద మురారి(krishna Mukunda murari) సీరియల్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రేరణ(Prerna) బిగ్‌బాస్(Biggboss) కు వెళ్లిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రేరణకు హీరోయిన్ రష్మిక(Rashmika)కు క్లోజ్ ఫ్రెండ్. రీసెంట్ గా తమ స్నేహంపై మాట్లాడుతూ ప్రేరణ ఎమోషనల్ అయింది. మీరూ, రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాం నిజమేనా అని అడగ్గా దానికి ప్రేరణ ఆన్సరిచ్చింది.
రష్మిక ఫ్యామిలీ, తన ఫ్యామిలీ క్లోజ్ అని, వాళ్ల ఫ్యామిలీ వాళ్లు నేను తెలుగులో స్టార్ అయితే, రష్మిక కన్నడలో స్టార్ అవుతుందని, తర్వాత ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయమని చెప్పేవాళ్లని, తాను, రష్మిక కూడా ఈ విషయంలో చాలా అనుకున్నామని, కానీ ఏమీ జరగలేదని, ఒకప్పుడు రష్మికకు తాను గుర్తుండేదాన్ని కానీ ఇప్పుడు కనీసం కలవడం కూడా లేదని, ముందు తనను కలవాలని ప్రేరణ చెప్పగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.