Game Changer: గేమ్ ఛేంజర్కు ముందు రోజే ప్రీమియర్లు?
పుష్ప2(Pushpa2) బెనిఫిట్ షో విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీని వల్లే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ అయ్యాడు. సంధ్యా థియేటర్ కు బన్నీ వెళ్లడం వల్ల అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మరణించడం బాధాకరమే అయినప్పటికీ దానికి బన్నీ(Bunny)ని మాత్రమే బాధ్యుణ్ని చేసి అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కరెక్ట్ అనుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో రాబోయే పాన్ ఇండియా సినిమాలకు స్పెషల్ ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనే అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఈ లిస్ట్ లో మొదటిగా వచ్చే పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ను డిసెంబర్ 21న యూఎస్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పెంచనున్నారు.
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే అంటే జనవరి 9నే ప్రీమియర్లు ఉంటాయని అఫీషియల్ హ్యాండిల్ లో చెప్పడం చూశాక అందరికీ ఆసక్తి పెరిగింది. మరి దానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ల ఇస్తాయా లేదా అనేది చూడాలి. మామూలుగా ముందు రోజు రాత్రి వేసే సెకండ్ షో ను రెగ్యులర్ షో గా చూపించుకుంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అలా కాకుండా అర్థరాత్రి షో అయితే స్పెషల్ ప్రీమియర్లు అవుతాయి కాబట్టి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. మరి దిల్ రాజ్(Dil Raju) ఏ దారిలో వెళ్తారో చూడాలి.













