ప్రేమ పిసాసి ట్రైలర్ విడుదల చేసిన మారుతి
జీపీఎస్, కపిలాక్షి, మల్హోత్రా, సోనాక్షివర్మ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ప్రేమ పిపాసి. పి.ఎస్.రామకృష్ణ నిర్మాత. మురళీరామస్వామి దర్వకుడు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు మారుతు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ట్రైలర్ నవ్యతతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. ట్రైలర్ మాదిరిగానే సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ కష్టపడి, ఇష్టపడి మేము చేసిన సినిమా ఇది. నేటి తరానికి నిజమైన ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. మారుతి మా ట్రైలర్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది అని అన్నారు. ప్రస్తుతం సెన్సార్ జరుగుతుందని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. సినిమా కోసం మేము పడ్డా కష్టానికి విజయం రూపంలో ప్రతి ఫలం దక్కుతుందనే నమ్మకముందని హీరో చెప్పారు.













