ప్రేమ జంట ప్రీ రిలీజ్ వేడుక
సన్వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్‌ప్రణీత్, సుమయ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమజంట. స్క్రీన్మ్యాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేస్తున్నారు. మహేష్ మొగుళ్లూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యుబైఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ఈవెంట్ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు సాగర్, టి.ప్రసన్నకుమార్ ఆడియో సిడిలను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత దగ్గుబాటి వరుణ్, దర్శకుడు నిఖిలేష్, హీరోయిన్ సుమయ, ప్రసన్నకుమార్, టిక్‌టాక్ దినేష్, బెంజ్బాబు, సురేష్ శెట్టిపల్లి తదితరులు పాల్గొన్నారు.













