అమెరికాలో తెలుగువారే నటించారు
పూర్తిగా అమెరికాలోనే అక్కడ నటీనటులు, సాంకేతిక సిబ్బందితో తెరకెక్కిన చిత్రం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. దీనికి దర్శక నిర్మాత గోవర్ధన్. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ప్రిరిలీజ్ ఫంక్షన్ వేడుకలో ఆయన మాట్లాడారు. చంద్రకాంత్, రాధిక, పల్లవి డోరా జంటగా నటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి), దర్శకులు కార్తీక్‌రెడ్డి, రామ్ భీమన, నగరాజు మాట్లాడుతూ చిత్రంలో నటించినవారు, పని చేసినవారు కూడా అమెరికాలో నివసిస్తున్న మన తెలుగువారే కావడం గమనార్హమనీ, దర్శకుడిగా గోవర్ధన్‌కు మంచి పేరు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 17న అమెరికాలో విడుదల కాబోతుంది.













