మళ్ళీ థియేటర్స్ లోకి “ప్రేమదేశం”…
ఒకప్పుడు ప్రేక్షకులని కథాకథనంతో మంత్రముగ్ధుల్ని చేసిన సినిమా ” ప్రేమదేశం “. స్నేహానికి ప్రాముఖ్యతని ఇస్తూ మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమాలోని తారాగణం, చిత్రీకరణ ఒక ఎత్తయితే , మ్యూజిక్ ఈ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టింది.
ఏఅర్. రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా, ప్రతీ పాట మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది. 1996 లో ఈ సినిమా ని తమిళం లో చిత్రీకరించి తెలుగులోకి డబ్ చేసారు. హిందీలో దునియా దిల్ వాలోంకి అనే పేరుతో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచి, వసూళ్ల వర్షాన్ని కురిపించింది ఈ సినిమా.
అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలలో నటించగా , డైరెక్టర్ ఖదీర్ ఈ చిత్రాన్ని అద్భుత కావ్యంలా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.
రీ రిలీజ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ” ప్రేమదేశం ” డిసెంబర్ 9 న మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులని పలకరించబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ మాత క్రియేషన్స్ బ్యానర్ పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమా మళ్ళీ థియేటర్స్ లో చూడడానికి ఈ జెనెరేషన్ యూత్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షో హైద్రాబాద్ లో వేయగా, నటి దివి , శ్రేయ ప్రియా, అర్జున్ లు ఈ షో కి హాజరయ్యారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని అందించిన నిర్మాత కేటి. కుంజుమోన్ హాజరయ్యి ప్రేమదేశం చిత్ర విశేషాలని మీడియాతో పంచుకున్నారు.













