ప్రేమ అంత ఈజీ కాదు ట్రైలర్ విడుదల
రాజేష్ కుమార్, ప్రజ్వాల్ జంటగా నటించిన చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. ఈశ్వర్ దర్శకుడు. టి.నరేష్, టి.శ్రీధర్ నిర్మించారు. హైదరాబాద్‌లో టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. టి.ఎన్.జె ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ త్వరలోనే పాటల్ని, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేస్తాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నచ్చిన వ్యక్తి మనసుని గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది. ఖోఖో, ఫ్లాష్ న్యూస్, వెతికా నేను నా ఇష్టంగా చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న రాజేష్ కుమార్ అభినయం అలరిస్తుంది అన్నారు. ధన్‌రాజ్, రాం ప్రసాద్, ముక్తార్‌ఖాన్, తదితరులు నటించారు.













