ప్రేమ అంత ఈజీ కాదు ఫస్ట్ లుక్ విడుదల
రాజేష్ కుమార్, ప్రజ్వల్ పూవియా జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. టి.నరేష్, శ్రీధర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రేమంటే ఏమిటో ఈ చిత్రంలో చూపెడుతున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ కొత్త నటీనటులతో తెరకెక్కించిన చిత్రమిది. జబర్దస్త్ నటులు కనిపిస్తారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. నవంబరులో కానీ, డిసెంబరులో కానీ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, కేదార్‌శంకర్ తదితరులు పాల్గొన్నారు.













