Preity Mukhudan: ప్రభాస్ ను అసలు కలుస్తానుకోలేదు: ప్రీతి ముకుందన్
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నుపూర్ సనన్(Nupoor Sanon) ఎంపికైంది. కానీ కొన్ని కారణాల వల్ల నుపూర్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం అనుకోకుండా ప్రీతి ముకుందన్(preity mukhundan) దక్కింది. వాస్తవానికి ఈ పాత్ర కోసం ప్రీతి కూడా ముందు ఆడిషన్ ఇచ్చింది కానీ హీరోయిన్ గా నుపూర్ సెలెక్ట్ అయింది. తర్వాత నుపూర్ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ తిరిగి ప్రీతికే దక్కింది.
ఇదిలా ఉంటే ఇటీవల ప్రీతి, ప్రభాస్(Prabhas) కలిసి పని చేసిన అనుభవాన్ని షేర్ చేసుకుంది. ప్రభాస్ తో కలిసి స్క్రీన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మర్చిపోలేనని, అసలు లైఫ్ లో ఒక్కసారైనా ప్రభాస్ ను కలుస్తానని అనుకోలేదని, అలాంటిది తనకు ప్రభాస్ తో నటించే అవకాశం రావడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తన కెరీర్లో అన్నింటికంటే హై ఇచ్చే మూమెంట్ ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేయడమేనని ప్రీతి వెల్లడించింది. కన్నప్ప మూవీ కోసం ప్రీతి గుర్రపు స్వారీతో పాటూ కత్తి యుద్ధంలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పింది. ప్రభాస్, అక్షయ్ కుమార్(Akhsay Kumar), మోహన్ లాల్(Mohan Lal), కాజల్(Kajal) లాంటి భారీ తారాగణం నటించిన కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.













