“Predator: Badlands” – అన్ని జోన్లతో కలిపిన హాలీవుడ్ చిత్రం!
హాలీవుడ్ యాక్షన్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి “ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్” సిద్ధమైంది. దర్శకుడు డాన్ ట్రాచెన్‌బర్గ్ నుంచి వస్తున్న ఈ సినిమా అంచనాలకు మించి ఉందని ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్ తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ఒక సూపర్ హార్ట్ టచింగ్ ఎంటర్టైనింగ్, యాక్షన్ అడ్వెంచర్ అని రిపోర్టులు చెబుతున్నాయి. ‘Badlands’ కేవలం రక్తపాతం, వేట గురించి మాత్రమే కాకుండా యాక్షన్, సై-ఫై, మానవ సంబంధాలతో కూడిన ఒక మాస్టర్‌పీస్ అని క్రిటిక్స్ కొనియాడుతున్నారు. “All killer, no filler – ఇది ఫన్, ఎమోషన్ నిండిన గెలాక్సీ రోడ్ మూవీ” అని రివ్యూలు దూసుకుపోతున్నాయి.
ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా విస్తరించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా, ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, వారి కోడ్ ఆఫ్ హానర్ లాంటి లోతైన కథాంశాలను డీల్ చేయడం ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ విస్తృత కథనం సిరీస్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇక డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ & ఎల్లె ఫ్యానింగ్ జోడీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పండించనుంది. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే మానవత్వం, ఫ్రెండ్షిప్, హ్యూమర్ సినిమాకు సరికొత్త ఫీల్‌ను తెచ్చి, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేస్తుందని రివ్యూల్లో హైలైట్ అవుతోంది.
ఈ అసాధారణమైన బజ్ మధ్య “Predator: Badlands” భారతీయ అభిమానుల కోసం నవంబర్ 7, 2025 న థియేటర్స్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కావడం భారత ప్రేక్షకులకు ఒక శుభవార్త. డాన్ ట్రాచెన్‌బర్గ్ సృష్టించిన ఈ “ఎమోషనల్ అడ్వెంచర్ హంట్” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే.







