ఈసారి సమ్మర్ కాస్త ముందుగానే!
సినిమాల విషయంలో సమ్మర్ సీజన్ అంటే మార్చి నెలాఖరు నుంచి మొదలవుతుంది. మార్చి మూడో వారానికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయి, ఆ తర్వాత మిగిలిన విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి, సినిమాల వైపు మళ్లుతారు. ఇక ఏప్రిల్ లో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. అంటే ఫిబ్రవరి నుంచి మార్చి మూడో వారం వరకు సినిమాలకు అన్ సీజన్ గానే అంటారు.
కానీ కరోనా తర్వాత ఈ లెక్కలన్నీ మారాయి. సీజన్, అన్ సీజన్ తో పని లేకుండా సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. ఈ అన్ సీజన్ అనుకునే రోజుల్లో కూడా మీడియం సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో వేసవి సందడి ఫిబ్రవరి మొదటి నుంచే మొదలైపోయింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
ఇక ఇవాళ ఈగల్ రిలీజై మిక్డ్స్ టాక్ తో ముందుకెళ్తుంది. నెక్ట్స్ వీక్ ఊరు పేరు భైరవకోన అనే క్రేజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తర్వాత మార్చి మొదటి వారం నుంచి సమ్మర్ ట్రీట్ స్టార్ట్ కానుంది. ఆపరేషన్ వాలెంటైన్ పాన్ ఇండియా స్థాయిలో మార్చి మొదటి వారంలో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా వస్తోన్న భీమా రానుంది. దీంతో పాటూ విశ్వక్సేన్ గామి కూడా రిలీజవుతుంది. మార్చి ఎండింగ్ లో టిల్లూ స్వ్కేర్ కూడా రిలీజ్ కానుంది. మొత్తానికి ఈ సారి సమ్మర్ లో సినిమాల వేడి ఎక్కువగానే ఉండబోతుందన్నమాట.













