ప్రతిరోజూ పండగే ప్రీ రిలీజ్ వేడుక
సాధారణంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో నాయకానాయికలతో పాటు చిత్రబృందం సినిమా తాలూకు అనుభూతుల్ని, ఆనందాల్ని మాటల రూపంలో అభిమానులతో పంచుకుంటారు. ప్రతిరోజూ పండగే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రబృందం నృత్యాలతో సందడి చేశారు. హీరో హీరోయిన్లు సాయితేజ్, రాశీఖన్నా, దర్శకుడు మారుతి, సమర్పకుడు అల్లు అరవింద్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులంతా వేదికపై స్టెప్పులతో అభిమానుల్ని అలరించారు. కెరీర్లో ఓ రెండళ్ల పాటు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో మెగా అభిమానులు తనకు అండగా నిలిచారు. అభిమానులు గర్వపడే సినిమా ఇది అని ఈ సందర్భంగా సాయితేజ్ పేర్కొన్నారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.













