హనుమాన్ క్రేజ్ మామూలుగా లేదుగా!
రానున్న సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో వేటికవే స్పెషల్ గా ఉన్నాయి. ఒక్కో సినిమా ఒక్కో జానర్లో రానుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం జనవరి 13న రిలీజ్ కానుండగా, అదే రోజు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హనుమాన్ కూడా థియేటర్లలోకి రానుంది.
జనవరి 13 విక్టరీ వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ రిలీజ్ కానున్నాయి. నాగార్జున చేస్తున్న నా సామిరంగ జనవరి 11 లేదా 14న రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదు సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న మూవీ అంటే గుంటూరు కారం సినిమానే. బుక్ మై షో లో అప్‌కమింగ్ సినిమాలపై తీసుకుంటున్న ఆడియన్స్ ఇంట్రెస్ట్స్లో గుంటూరు కారం మూవీకి 101K ఇంట్రెస్ట్స్ నమోదు చేసుకుంది.
దీని తర్వాత రెండో స్థానంలో హనుమాన్ మూవీ ఏకంగా 68K ఇంట్రెస్ట్స్ తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత నా సామిరంగకు 18.4K, సైంధవ్‌కు 9.8K ఇంట్రెస్ట్స్, ఈగల్‌కు ఆఖరిగా 8.4K ఇంట్రెస్ట్స్‌తో ఉన్నాయి. మహేష్ సినిమా టాప్ లో ఉండటం విశేషమేమీ కాదు. కానీ హనుమాన్ రెండో ప్లేస్ లో ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.
హనుమాన్ అనే పేరుకు ఉన్న క్రేజే ఈ సినిమాకు పట్టం కట్టనుంది. ప్రశాంత్ వర్మ కూడా రీసెంట్గా ప్రెస్‌మీట్ లో తాము చిన్నవాళ్లైనా తమ సినిమా పెద్దదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్‌కు తగ్గట్టుగానే బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ కూడా ఉండటం హనుమాన్ మూవీకి క్రేజ్‌ను మరింత పెంచనుంది.













