సలార్‌కు నీల్ రెమ్యూనరేషన్ ఎంత?
సలార్ పార్ట్ 1 భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.150 కోట్లు వసూలు చేసిందని తాజా ఇన్ఫర్మేషన్. ఈ సినిమాను భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ పై పలువురు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత తీసుకున్నాడనే దానిపై ఇప్పుడు అందరి కన్ను పడింది.
సలార్ కోసం ప్రభాస్ రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, పైగా అదనంగా లాభాల్లో షేర్ అందుకుంటున్నాడని టాక్ ఉంది. అలాగే సలార్ కోసం ప్రశాంత్ నీల్ కూడా రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ ఈ పుకారు మాత్రం నెట్టింట తెగ వినిపిస్తొంది.
సలార్ మొత్తం ప్రశాంత్ టాలెంట్ పైనే ఆధారపడిన సినిమా కాబట్టే, ఈ మూవీ కోసం అతనకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ, ప్రశాంత్ నీల్ టాలెంట్ కు అదేమీ ఎక్కువ కాదని అంటున్నారు. ఏదేమైనా ఉగ్రం లాంటి మూవీతో ఎంట్రీ ఇచ్చి, ఇవాళ 100 కోట్లు అందుకునే డైరెక్టర్ గా ఎదిగాడంటే ప్రశాంత్ నీల్ టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.













