‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కెజిఎఫ్’ పలు భాషల్లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందిరికీ తెలిసిందే. కన్నడలో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చెయ్యాలని టాలీవుడ్ హీరోలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తారని, మ్యూజిక్, డాన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రం కోసం ఎన్టీఆర్ డాన్స్‌లోని మరిన్ని మెళకులవను తెలుసుకుంటున్నారట. ఎన్టీఆర్ 31వ చిత్రంగా రూపొందే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న వెలువడుతుంది. 2021లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో, ప్రశాంత్ నీల్ ’కెజిఎఫ్ 2’ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇవి కంప్లీట్ అవ్వగానే ఈ భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమా ఇండియాలోని పలు భాషల్లో విడుదలవుతుంది.













