గుంటూరు కారంతో పోటీ గురించి ప్రశాంత్ వర్మ సన్సేషనల్ కామెంట్స్
సంక్రాంతికి సినిమాల పోటీ చాలా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎంత పోటీ ఉన్నా సరే తము రేసులోంచి తప్పుకునేదే లేదని హనుమాన్ టీమ్ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చింది. గుంటూరు కారం రిలీజ్ అవుతున్న జనవరి 12 రోజునే హనుమాన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఒకేరోజు రిలీజ్ చేయడం రిస్క్ అంటున్న కొంతమందితో తమ సినిమా మీద నమ్మకంతోనే పోటీకి రెడీ అయ్యామని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
డైరెక్టర్ గా తను, హీరోగా తేజ చిన్న వాళ్లమే అయినా, సంక్రాంతికి రావడానికి తమకు పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేరని, తమకు ఉన్న ఒకే ఒక్క స్టార్ హనుమాన్ అని, ఆ నమ్మకంతోనే హనుమాన్ ను పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పిన ప్రశాంత్ వర్మ, తాము చిన్న వాళ్లమే అయినా తమ కంటెంట్ పెద్దదని తెలిపాడు.
గుంటూరు కారంతో పోటీ గురించి కూడా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి రానున్న అన్ని సినిమాల్లో తమే ముందుగా డేట్ ప్రకటించినట్లు చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన జనవరి 12 రోజు తోనే నార్త్ లో మొత్తం అగ్రిమెంట్స్ జరిగిపోయాయని, అందుకే సినిమాను 12న రిలీజ్ చేయాల్సొస్తుందని తెలిపిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తమ ఫేవరెట్ అయిన మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మూవీ గుంటూరు కారంను ఫస్ట్ డే చూస్తామని తెలిపాడు.













