బాలీవుడ్ ను టార్గెట్ చేసిన ప్రశాంత్ వర్మ
అ!, జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో డైరెక్టర్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్. హనుమాన్ సినిమా భారీ విజయం సాధించడంతో జై హనుమాన్ మీద నెక్ట్స్ లెవెల్ లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో కనిపించకపోవచ్చంటున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీఓరగా ఓ సినిమా చేయనున్నాడని టాక్ బయటికొచ్చింది. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అయి, రణ్వీర్ కు స్టోరీ చెప్పి ఓకే చేయించాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బ్రహ్మరాక్షస అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నాడని, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించనుంని తెలుస్తోంది.
ఇది కాకుండా మరో రెండు బాలీవుడ్ సినిమాలకు కూడా ప్రశాంత్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బ్రహ్మ రాక్షస తర్వాత ఈ సినిమాలు రానున్నాయి. అతి త్వరలోనే బ్రహ్మ రాక్షసకు సంబంధించిన అనౌన్స్మెంట్ అధికారికంగా వచ్చే అవకాశాలున్నాయి. బ్రహ్మ రాక్షసను హిందీలో తీసినప్పటికీ సౌత్ లోని అన్ని భాషలతో పాటూ విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి జై హనుమాన్ రిలీజ్ అయిన వెంటనే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో జెండా పాతేయడానికి రెడీ గా ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది.













