టామ్ క్రూజ్ వచ్చి అడిగినా సినిమా చేయను ప్రశాంత్ వర్మ
హను మాన్ సినిమాతో ఒక్కసారిగా దేశమంతటా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమా అ! నుంచే తను మాట్లాడే మాటలు ఎంతో కాన్ఫిడెంట్ గా, చాలా పెద్ద స్థాయిలో ఉండేవి. ఇప్పుడు హను మాన్ తో మంచి విజయం అందుకోవడంతో ప్రశాంత్ లో ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ వచ్చినా సినిమా చేయనంటున్నాడు.
ఇంతకుముందు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ట్రై చేసి, ఫెయిలైన తర్వాత తాను డెడ్ లైన్ పెట్టుకుని సినిమాలు చేస్తున్నానని, అందుకే తన సినిమాల ఫ్రీక్వెన్సీ పెరిగిందని ప్రశాంత్ తెలిపాడు. ఇప్పడు టామ్ క్రూజ్ వచ్చి సినిమా చేద్దామన్నా తాను ఆల్రెడీ కమిటైన వాళ్లతోనే సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
ఒకప్పుడు తనను ఏ స్టార్ పట్టించుకోలేదని చెప్పిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోలతో సినిమా చేస్తే టైమ్ ఎక్కువ పడుతుందని, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సొస్తుందని తెలిపాడు. ఇక రాజమౌళి గురించి తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనకు తను ఏకలవ్య శిష్యుడినని, ఆయన సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎంతో నేర్చుకున్నాడు చెప్పాడు.













