అవతార రేంజ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జ ప్రధాన పాత్రలో హను మాన్ అనే సూపర్ హీరో ఫిల్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్ కు భారీ అంచనాలున్నాయి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నాలుగు పెద్ద సినిమాలతో కలిపి రిలీజ్ చేసే స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది.
జనవరి 12న హను మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కారణంగా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. రీసెంట్ గా అతను చేసిన ఓ కామెంట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ తను అనుకున్నట్లు పెర్ఫార్మ్ చేస్తే, తాను అవతార్‌ను మించిన సినిమా తీస్తానని చెప్పాడు. తాను భవిష్యత్తులో చేయబోయే భారీ సినిమాలకు హను మాన్ ఒక పునాది అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏకంగా అవతార్ ను మించిన సినిమా అనేసరికి ప్రశాంత్ ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. కలలు కనొచ్చు కానీ ఇలాంటి కలలు కాదని కామెంట్స్ చేయడంతో, హను మాన్ వర్కవుట్ అయితే వీఎఫ్ఎక్స్ ఆధారంగా అవతార్ లాంటి భారీ సినిమాలు చేయడానికి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు ఆశ కలుగుతుందనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడినట్లు క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.













