ప్రభాస్ ఎంట్రీని అలా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వస్తోన్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇంకో నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సగటు మూవీ ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. అందులో కథకు సంబంధించిన వివరాలేమీ రివీల్ చేయలేదు. దీంతో ఇప్పుడు అందరూ సలార్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 3న సలార్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని సంకేతాలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విలన్లకు సంబంధించి ఓ కీలక అప్డేట్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా వినిపిస్తోంది.
సలార్ లో ఇద్దరు విలన్స్ ఉన్న విషయం విదితమే. జగపతిబాబుది విలన్ కు తండ్రి పాత్ర. జగపతిబాబు కొడుకు పృథ్వి రాజ్. మొదటి భాగం సీజ్ ఫైర్ ఫస్ట్ హాప్ లో ముప్పాతిక శాతం స్క్రీన్ స్పేస్ పృథ్వీరాజ్కే ఉంటుందట. ప్రభాస్ ని చూపించీ చూపించనట్లు ఉంచి, ప్రీ ఇంటర్వెల్లో డార్లింగ్‌ని ఓ భారీ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఇంట్రడ్యూస్ చేసి మైండ్ బ్లాంక్ చేయనున్నాడట ప్రశాంత్ నీల్.
అక్కడి నుంచి సలార్, పృథ్వీ రాజ్ మధ్య ఫేస్ టు ఫేస్ వార్ తో థియేటర్లు షేక్ అవడం ఖాయమని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో జగపతి బాబు కొంత భాగానికి మాత్రమే పరిమితమవ్వనున్నాడని, పార్ట్ 2లో ఫాదర్ ప్రభాస్ కు, జగపతిబాబుకు మధ్య జరిగే వార్ మరో లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సలార్ ఫస్ట్ పార్ట్ కు జరుగుతున్న బిజినెస్‌కు ట్రేడ్ పండిట్స్ కు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది.













