రవితేజతో ప్రసన్న కుమార్ బెజవాడ మూవీ
సినిమా చూపిస్తా మావ మూవీతో రైటర్ గా టాలీవుడ్ కి పరిచయమైన ప్రసన్న కుమార్ బెజవాడ, వరుస హిట్లతో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ధమాకా సినిమా తర్వాత నాగార్జున, ప్రసన్న కు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఓ రీమేక్ స్టోరీ తో నాగ్ ను హీరోగా పెట్టి సినిమా చేయడానికి అన్నీ రెడీ చేసుకుని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రసన్న ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ రీమేక్స రైట్స్ విషయంలో సమస్యలు రావడంతో సినిమా లేటవుతూ వచ్చింది. రీమేక్ రైట్స్ అభిషేక్ అగర్వాల్ చేతిలో ఉండటంతో ఆ ఇష్యూని ప్రసన్న కుమార్ కూడా ఫేస్ చేయాల్సొచ్చింది. ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు ఆఖరికి క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది.
మరి నాగ్, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి కలిసి వేరే దర్శకుడితో ఈ రీమేక్ చేస్తారా లేదా మరో స్టోరీతో సినిమా చేస్తారో తెలియదు కానీ ప్రసన్న అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అని తెలుస్తోంది. దీంతో ప్రసన్న రవితేజకు ఓ స్టోరీ చెప్పి ఓకే అనిపించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవితేజ, ఇప్పుడు ప్రసన్నను కూడా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది.













