ఈ టైంలో నాగ్ రిస్క్ , అవసరమా అంటున్న ఫాన్స్..
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఒక కమర్షియల్ హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. బంగార్రాజు సినిమాతో మైల్డ్ హిట్ ని అందుకున్న నాగార్జున, ది ఘోస్ట్ తో ప్రేక్షకులని, అక్కినేని అభిమానులని నిరాశ పరిచాడు. ఏమాత్రం ఆకట్టుకోని ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.
ఈ సినిమా ప్లాప్ తో నాగ్ అలెర్ట్ అయ్యారట. తన తదుపరి సినిమాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. ఈ సరి చాలా కథలు విన్న తరువాత ఎట్టకేలకు ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన కథకు కన్విన్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ నటించి హిట్ కొట్టిన ‘ సినిమా చూపిస్త మామ ‘ చిత్రానికి కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ నాగ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. రచయితగా ఎన్నో ఇయర్స్ అనుభవం ఉన్న ప్రసన్న కుమార్ డైరెక్ట్ చేయబోతున్న సినిమామీద ప్రేక్షకులు బాగానే ఆశలు పెట్టుకున్నారు.
కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నాగ్ ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు, ఈ జాబితాలో ఇప్పుడు ప్రసన్న కుమార్ చేరిపోయాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. భారీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాలో ఉండబోతుందని, దీనికోసమే బడ్జెట్ లో మెజారిటీ పార్ట్ ని ఖర్చు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మిస్తాడట. ఈ మధ్య నాగ్ సినిమాలకి మార్కెట్ తగ్గిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొత్త వాళ్ళతో, సొంత బ్యానర్ పై రిస్క్ చేయడం అవసరమా? అని అక్కినేని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. నాగార్జున పెద్ద రిస్క్ చేయబోతున్నాడు అని సినీవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో కొత్త దర్శకుడిపై నాగ్ పెట్టుకున్న నమ్మకం ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.













