ఒక్క కథతో స్టార్ రైటర్ గా మారిన ప్రసన్న కుమార్
వెండితెరపై దాదాపు ఒకే కథతో చాలా సినిమాలు వస్తుంటాయి. అప్పుడెప్పుడో కృష్ణం రాజు నటించిన ప్రాణ స్నేహితులు కథతో రజినీకాంత్ అన్నామలై తీస్తే సూపర్ హిట్ అయింది. దాన్ని వెంకటేష్ మళ్లీ కొండపల్లి రాజాగా తీసి మరో హిట్ కొట్టాడు. అన్నామలైని బిర్లా రాముడిగా డబ్బింగ్ చేసి రజినీ మళ్లీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలన్నింటి స్టోరీ ఒకటే.
అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఒకే కథతో టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మీద మొదట్లో ఓ కామెంట్ ఉండేది. అతను ఒకే కథను మళ్లీ మళ్లీ అమ్ముతున్నాడని. అప్పట్లో ప్రసన్న ఈ కామెంట్ పై స్పందించలేదు కానీ తర్వాత ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సినిమా చూపిస్తా మావా సినిమాను రాజ్ తరుణ్ తో అనుకున్నప్పుడు మొదట్లో బోల్డ్ కంటెంట్ అనుకున్నానని, కానీ అవికా గోర్ అభ్యంతరం చెప్పడం వల్ల కథ కామెడీగా మారి వర్కవుట్ అయిందని చెప్పాడు.
తర్వాత దిల్ రాజు అలాంటి పాయింట్ మీదే కథ కావాలనడంతో నేను లోకల్ రాశానని, అది కూడా సక్సెస్ అయిందని చెప్పాడు. ఆ తకంవాత మళ్లీ దిల్ రాజు బ్యానర్ లోనే హలో గురు ప్రేమ కోసమేలో కూడా ఇదే మామా అల్లుళ్ల కాన్సెప్ట్ తో ఫ్రెండ్ షిప్ ను యాడ్ చేసి హిట్ అందుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు ఈ మూడు సినిమాలకు డైరెక్టర్ త్రినాథరావు నక్కిననే. అంతేకాదు ధమాకాలో కూడా రవితేజ, రావు రమేష్ మధ్య కాస్త ఈ కథ ఛాయలు కనిపిస్తాయి. మొత్తానికి ఈ రైటర్ ఒకే కథతో స్టార్ రైటర్ అయిపోయాడన్నమాట.













