బాలీవుడ్ కు ప్రణీత ఎంట్రీ
పవన్‌కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది ప్రణీత సుభాష్. ఈ చేపకళ్ల సుందరి అందానికి, నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. పవన్ తన కెరీర్‌కు బిగ్ బ్రేక్ ఇచ్చినా ఎందుకనో దానిని నిలబెట్టుకోవడంలో మాత్రం ప్రణీత తడబడింది. తెలుగులో వరుసగా ఫ్లాపులు ఎదురవ్వడంతో తిరిగి కన్నడ చిత్ర పరిశ్రమకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ బిజీగా ఉంది. అయితే ప్రణీత బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌లో ఆమెకు అవకాశం దక్కింది. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా వంటి టాప్ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాకు భజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో టాలీవుడ్ హీరో రానా ఓ కీలక పాత్ర పోషించనున్నారు.













