ఘనంగా ప్రణీత వివాహం..

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ పెండ్లి పీటలెక్కింది. వ్యాపారవేత్త నితిన్ రాజును (మే 30) వివాహం చేసుకుంది ప్రణీత. బెంగళూరులో జరిగిన వెడ్డింగ్ సెర్మనీకి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయినట్టు ప్రణీత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే ఘనంగా పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. లాక్‍డౌన్ కాలంలో ఇలా సడెన్‍గా పెండ్లి పీటలెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ప్రణీత. ప్రణీత-నితిన్ రాజు వెడ్డింగ్‍కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
పోర్కీ (పోకిరి కన్నడ వెర్సన్) చిత్రంతో ప్రణీత కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో పలు సినిమాల్లో ప్రణిత నటించింది. ఎన్టీఆర్ తో రభస, పవన్ కల్యాణ్‍తో అత్తారింటికి దారేది, మహేశ్ బాబుతో బ్రహ్మోత్సవం, పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత. కర్ణాటకు చెందిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో హంగామా 2, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది.