బాలీవుడ్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రణీత
కన్నడ సోయగం ప్రణీత వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది. తెలుగులో అత్తారింటికి దారేది లో నటించిన ఈమె కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత తాజాగా బాలీవుడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది దర్శకుడు ప్రియదర్శన్ చిత్రంలో చేస్తోంది. హిందీలో రూపొందుతోన్న హంగామా 2 సినిమాలో ఈమెను కథనాయికగా ఎంపిక చేశారు ఈ దర్శకుడు. ఈమె హిందీలో ఇది వరకే నటించింది. అదే అజయ్ దేవగన్‌తో చేసిన భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇప్పుడు హంగామా 2 ఈమెకు రెండో చిత్రం. మేజాన్ జప్రీ కథానాయకుడు. ఈ సందర్భంగా ప్రియదర్శన్ మాట్లాడుతూ ఆడిషన్స్‌కు ఆమె వచ్చినప్పుడు ఈమె మాత్రమే ఆ పాత్ర చేయగలరు అనిపించింది. జఫ్రీతో ఈమె జోడీ చాలా బాగుంటుంది. నా సినిమా ఈ కొత్త కాంబినేషన్లో పనిచేయడంపై ఎక్సయిట్ అవుతున్నా అని తెలిపారు.













