బెంగుళూర్లో బూట్లెగర్ పబ్ ని ప్రారంభించిన బాపు బొమ్మ ప్రణీత సుభాష్
దీపం ఉండగానే ఇల్లు సక్కపెట్టుకోవాలని పెద్దలు చెపుతుంటారు. ఎన్నో ఎత్తు పల్లాలు వుండే సినీ పరిశ్రమలో ఆర్టిస్ట్ కెరీర్ ఒకేలా ఉండదు అందుకే హీరోలు సక్సెస్ వున్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. సంపాదన వస్తున్నప్పుడే ఇతర రంగాలపై పెట్టుబడి పెడుతూ వుంటారు కొందరు రియల్ ఏస్టేట్ పైన కొందరు స్టార్ హోటల్స్, పబ్, ఫామిలీ రెస్టారెంట్, షాపింగ్ మాల్ వంటి రెగ్యులర్ సంపాదన వుండే వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతోవుంటారు. హీరోయిన్లు విషయానికొస్తే సాధారణంగా తమకు అనుకూలమైన దుస్తుల వ్యాపారం, నగల వ్యాపారం, రెస్టారెంట్లు, ఫిట్నెస్ కి సంబంధించిన జిమ్ బిజినెస్ లు లేదంటే సినీ నిర్మాణం వంటి బిజినెస్ లలోకి అడుగు పెడుతూ ఉంటారు. కానీ ఇంతవరకు మన దేశంలోని ఏ నటి కూడా పబ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సందర్భాలు మనకి తెలిసి లేవు. ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఓ హీరోయిన్ పబ్ బిజినెస్ లోకి అడుగుపెడుతోంది. ఆమె ఎవరో కాదు.. తెలుగు వారికి బాగా సుపరిచితమైన ప్రణీత సుభాష్. అందం, అభినయం కలబోత అయిన ఆమె అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది. ఇక కరోనా వేళ టాలీవుడ్ కి చెందిన పేద సినీ కార్మికుల కోసం చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసిస్ చారిటీ సిసిసికి అందరు హీరోయిన్ల కంటే ముందుగా విరాళం ప్రకటించి అందరి ప్రశంసలు పొందింది. స్వయంగా తన చుట్టు ఉన్న ఆకలితో బాధపడుతున్న పేద ప్రజల కోసం స్వయంగా తానే తన సొంత ఖర్చులతో వంట చేస్తూ లక్షల మంది ఆకలి తీరుస్తోంది. రెండు స్కూళ్లని కూడా దత్తత తీసుకుని మన మంచి మనసును చాటుకుంది. తన ఫౌండేషన్ కి ఫ్రెండ్స్, దాతలు ఇచ్చిన 8లక్షలు కూడా ఈ క్రెయిసెస్ లో ఖర్చు చేయడానికి సిద్ధంగా వుంది.
ఈమె తెలుగులో అత్తారింటికి దారేది ముందు తర్వాత రభస వంటి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు సిద్దార్డ్,రామ్, మంచు విష్ణు వంటి వారితో జోడీ కట్టినా క్లిక్ కాలేదు. అదేసమయంలో తన మాతృ భాష అయిన కన్నడతో పాటు తమిళంలో మంచి అవకాశాలు రావడంతో తెలుగు వైపు చూడటం లేదు. కానీ తానెప్పుడో అది కూడా పెద్ద చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా, చిన్న హీరోలతో మెయిన్ హీరోయిన్ గా కేవలం కొన్ని చిత్రాలలో అందునా ఫ్లాప్ చిత్రాలలో నటించి తెలుగుకి దూరంగా ఉంటున్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీపై తనకున్న అభిమానంతో ఈమె ఇలా తన దాతృత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చూపు పబ్ బిజినెస్ వైపుకు మరలింది. కుర్రకారు మెచ్చే బిజినెస్ ని ఎంచుకునే క్రమంలో ఈమె పబ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అందులో భాగంగా ఈమె బెంగుళూర్లో బూట్లెగర్ అనే పేరుతో పబ్ ని ప్రారంభించింది. ముందు చూపుతో ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈమె ఈ పబ్ ని ప్రారంభించి మంచి బిజినెస్ ఉమెన్ అయ్యే లక్షణాలు తనలో ఉన్నాయని మంచి మార్కులుకొట్టేసింది. ఏ సేవ క్రయక్రమాలు చేయాలన్న డబ్బు అవసరం నా మనుగడ కోసం నా ఫౌండేషన్ కోసం ఇటీవలే ఈ వ్యాపారం ప్రారంభించానని, అంతేకాకుండా మరో వ్యాపారం వైపు దృష్టి సారిస్తున్నానని తెలిపింది.













