గురువు అయిన శ్రీలీల!
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి కొరత ఉందనే చెప్పాలి. బేబీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తెలుగుమ్మాయి వైష్ణవి చైతన్య, ఈ మూవీతో మంచి హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. మూవీ సక్సెస్ మీట్ కి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలుగు పరిశ్రమలోకి తెలుగు హీరోయిన్స్ రావాల్సిందిగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మైలు రాయిని సొంతం చేసుకొన్న మరో యువ కథానాయకి శ్రీలీల. తన మొదటి సినిమానే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో పెళ్ళిసందడి మూవీ చేసి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ వరుస మూవీస్ తో బిజీ బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. తాజాగా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు నటిస్తున్న ‘స్లమ్ డాగ్ హస్బెండ్ ‘ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమంకు శ్రీలీల అతిథిగా హాజరయ్యారు.
కాగా ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న మరో తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ కూడా సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన ప్రణవి ఇప్పటికే రొటీన్ లవ్‌స్టోరీ, ఉయ్యాలా జంపాల, అమిగోస్ సినిమాల్లో నటించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా వచ్చిన శ్రీలీల టాలీవుడ్ లోకి మరింత మంది తెలుగమ్మాయిలు రావాలని, ఇక్కడ మంచి లైఫ్ ని లీడ్ చేయాలని అభిప్రాయపడింది. ఇదే సమయంలో ప్రణవి తన పక్కనే కూర్చొన్న శ్రీలీల ని ఎక్కడ ఎలా ఉండాలి అని ప్రశించగా? దానికి శ్రీలీల మనకున్న బౌండరీస్ దాటకుండా వాటిని అలానే ఉంచుతూ మెయింటైన్ చేస్తే చాలు అంతా సేఫ్ అని ప్రణవికి కొన్ని సలహాలు కూడా ఇచ్చిందట. ఇలా తనకున్న అనుభవాన్ని ప్రణవితో షేర్ చేసుకొన్నది శ్రీలీల. మరి ప్రణవి ఈ సలహాలని ఎలా పాటిస్తుందో వేచి చూడాల్సిందే.













