‘ప్రాణం ఖరీదు’ ట్రైలర్ ను విడుదల చేసిన రాఘవేంద్రరావు
ప్రశాంత్ అవంతిక హీరోయిన్గా నందమూరి తారకరత్న ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ప్రాణంఖరీదు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా, పిఎల్కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్రైలర్‌ను చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. యువకులు మంచి మంచి ఆలోచనలతో సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా చాలా మంది కుర్రాళ్ళు హీరోలుగా, దర్శకులుగా వస్తారు అని అన్నారు. చిత్ర కథానాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ అమెరికాలో, ఇండియాలో విరామం లేకుండా షూటింగ్ చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇదే నెల 15న సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఇతర పాత్రల్లో షఫీ, జెమినీ సురేష్, చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి, సంజన నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, మాటలు: మరుధూరి రాజా.













