త్వరలో ‘ప్రాణం ఖరీదు’
ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్లుగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో ఎస్ఎస్ క్రియేషన్స పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పిఎల్కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ ప్రాణం ఖరీదు మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుబైఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సంరద్భంగా నిర్మాత మాట్లాడుతూ మా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుందన్నారు. యుబైఎ రావటం ఆనందంగా ఉందన్నారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్‌ను అభినందించారన్నారు. చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామన్నారు.













