ప్రాణం ఖరీదు ఆడియో విడుదల
ప్రశాంత్, అవంతిక జంటగా నటించిన చిత్రం ప్రాణం ఖరీదు. తారకరత్న ప్రధానపాత్ర ధారి. పి.యల్.కె. రెడ్డి దర్శకుడు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. వందేమాతరం శ్రీనివాస్ స్వరకర్త. హైదరాబాద్లో ఆడియో సీడీలను నిర్మాత కె.యల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. బెక్కెం వేణుగోపాల్ తొలి సీడీని స్వీకరించారు. దర్శకుడు మాట్లాడుతూ ఉత్కంఠతతో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్లో వినోదం, సెంటిమెంట్ అంశాలు మిళితమయ్యాయి. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అదనపు ఆకర్షణ. పాటలే కథకు ప్రాణం పోశాయ న్నారు. నిర్మాత మాట్లాడుతూ నటీనటులు పాత్రలో ఒదిగిపోయారకు. ప్రతి సన్నివేశానికి ఆసక్తి కలిగేలా దర్శకుడు చిత్రీకరించారు. ఆడియోకి చక్కటి స్పందన లభించింది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రశాంత్, అవంతిక తదితరులు పాల్గొన్నారు.













