రాజ్యసభకు ప్రకాశ్ రాజ్?
దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ని రాజ్యసభకు పంపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కొంతమంది సాహితీవేత్తలు కోరారట. అలా చేస్తే కాంగ్రెస్‌కు మైలెజ్ పెరుగుతందని కూడా చెప్పారట. అయితే ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాశ్‌రాజ్ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని రాజ్యసభకు పంపిస్తే చాలా బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందట. దీంతో సాహితీవేత్తలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వారి అభిప్రాయాన్ని చెప్పారట. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ అధిష్టానంకానీ స్పందిస్తే ప్రకాశ్‌రాజ్‌ని రాజ్యసభకు పంపాలా? వద్దా? అనే అంశంపై సృష్టత వస్తుంది.













