మా అధ్యక్ష బరిలో… ప్రకాశ్ రాజ్

మా అధ్యక్ష బరిలో మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలియజేశారు. తెలుగు చిత్రసీమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని అధిగమించడడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. తెలుగు చిత్రసీమ చాలా పెద్దదన్న ప్రకాశ్ రాజ్ మా కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. మా కు ఇప్పటి వరకు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిని అయితే 100 శాతం సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మాకులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానని తెలిపారు.