లోన్ తీసుకుని పేదలకు సాయం చేస్తా
కరోనా ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్ తనచుట్టూ ఉన్న ఎందరినో ఆదరిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆయన 1000 కుటుంబాలకు పైగా సాయం చేస్తున్నారు. అంతేకాదు అనేక మందికి తన పాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఇప్పటికీ బయట ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తూ వారి ఆకలి తీర్చుతున్నారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే లోన్ తీసుకోనైనా పేదలకు సాయం చేస్తా. కావాలంటే నేను మళ్లీ సంపాదించుకోగలను. ఇలాంటి క్లిష్ట సమయంలో మానవత్వంతో వ్యవహరించాలి. మనమంతా ఐకమత్యంతో పోరాడుదాం. అవసరాల్లో ఉన్న వారికి చేయూతగా ఉందా అంటూ ఆయన ట్వీట్టర్లో రాశారు. ప్రకాశ్ రాజ్ చేస్తున్న సాయానికి నెటిజన్లు ప్రశంసించారు.













