1997లో మోహన్ లుక్‌ను విడుదల చేసిన ప్రకాష్ రాజ్
డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటీ ప్రధాన పాత్రల్లో డాక్టర్ మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్ మూవీ 1997. ఈ చిత్రానికి సంబంధించిన మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. తాజాగా మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్‌ను సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఇప్పుడు హీరో మోహన్లుక్ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. హీరో, దర్శకుడు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ ఓ రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకున్ని బర్నింగ్ ఇష్యూని తీసుకుని దానికి కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేశానని తెలిపారు. తప్పకుండా ఈ మూవీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా పాల్గొన్నారు.













