దీపికా పదుకొనె బికినీపై ప్రకాష్ రాజ్ కామెంట్స్…!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె లేటెస్ట్ మూవీ పఠాన్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా రిలీజైన బీచ్ సాంగ్ స్టిల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బికినిలో అందాలని ఆరబోస్తూ దీపికా షారుఖ్ తో కలిసి హాట్ హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బికినీ కథ ఇటు సోషల్ మీడియా, అటు పొలిటికల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
మొదట్లో దీపికా అందాల ఆరబోతపై చర్చ జరిగింది. షారుఖ్ ని టార్గెట్ చేస్తూ లేటు వయసులో ఘాటు స్టిల్స్ అవసరమా అంటూ విమర్శలు వినిపించాయి. తర్వాత ఈ అమ్మడి బికినీ టాపిక్ కాస్తా రాజకీయ చర్చలకు తెర తీసింది. పఠాన్ బీచ్ సాంగ్ లో దీపికా ధరించిన బికినీ కలర్ కాషాయం కావడమే ఈ చర్చకి కారణం.
దీపిక ధరించిన బికినీ రంగు బీజేపీ పార్టీ కాషాయ రంగు అంటూ కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీంతో సీన్ మరింత రసవత్తరంగా మారింది. దీపిక అందాలని పక్కన పెట్టేసి, మా పార్టీ రంగు ఉన్న డ్రెస్ ని ధరిస్తావా? ఎంత దైర్యం అంటూ కాషాయ వీరులు ముందుకొచ్చారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ వార్నింగ్ పఠాన్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బికినీ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ఎంపీలో రిలీజ్ అవుతుంది,
లేకపోతే తాను ఏం చేయాలో అదే చేస్తానని పబ్లిక్ గానే హెచ్చరించారు. ఇదే సమయంలో పెళ్లైన హీరోయిన్ ఇలా బికినీ లు ధరించడమే గాకుండా హీరోతో ఆ రేంజ్ లో రొమాన్స్ అవసరామా? అంటూ నెటిజన్స్ దీపికాపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదాస్పదమైన చర్చ లోకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అడుగు పెట్టారు. దీపికా డ్రెస్ పై , సోషల్ మీడియా , పొలిటికల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ పై ఆయన స్పందించి , దీపికకి తన మద్దతుని తెలుపుతూ.. ఇంకెంత కాలం ఈ రంగుని భరించాలి? కాషాయ ముసుగులో ఎన్ని దారుణాలైనా చేయొచ్చుగాని, ఆ రంగు బికినిని సినిమాలో వేసుకోకూడదా? అని ఘాటుగానే ప్రశ్నించారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీపికాని సపోర్ట్ చేస్తూ ఈయన చేసిన కామెంట్స్ కి ఇటు పాజిటివ్ , అటు నెగటివ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ అమ్మడి బికినీ చర్చలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.













