Betting Apps : నేను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదు : ప్రకాశ్‌రాజ్

బెట్టింగ్ యాప్స్ (Betting Apps )తో డబ్బు సంపాదించాలని ఎవరూ భావించవద్దని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakashraj) సూచించారు. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో ఈడీ (ED) ఎదుట విచారణకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు ఆయన్ను ఐదు గంలపాటు విచారించారు. అనంతరం మీడియాతో ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రకారం వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదన్నారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయనని తెలిపారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని, మళ్లీ విచారణకు పిలవలేదన్నారు.