కల్కిలో ట్విస్టులే ట్విస్టులు
మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న కల్కి 2898ఏడి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ చేయకూడదని చిత్ర బృందం ఆఘమేఘాల మీద వర్క్ చేస్తుంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి మెయిన్ సిటీల్లోని థియేటర్లకు ఇప్పటికే పబ్లిసిటీ మెటీరియల్ ను కూడా పంపేశారు. మే 9 అనే డేట్ ను మెన్షన్ చేస్తూ ఉన్న స్టాండీలు పలు చోట్ల కనిపిస్తున్నాయి.
కాబట్టి కల్కి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. రీసెంట్ గా ప్రభాస్, దిశా పటానీ మీద ఇటలీలో ఓ సాంగ్ ను షూట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి క్యారెక్టర్లకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎన్నో ట్విస్టులు పెట్టాడట.
శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన కల్కిగా ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనుండగా, సకల సృష్టికి సౌభాగ్యం సమకూర్చే లక్ష్మి దేవి పునర్జన్మ పొందితే ఎలా ఉంటుందో అలా దీపికా నటిస్తున్న పద్మ క్యారెక్టర్ ఉండబోతుందట. వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తారని ఇన్ సైడ్ సోర్స్. ఇద్దరి మధ్య కమర్షియల్ సాంగ్స్ లాంటివి పెట్టకుండా ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ సాంగ్స్ ను పెట్టనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా సరే ఆన్ స్క్రీన్ పై ప్రభాస్, దీపికా జోడి కొత్తగా అనిపించడం ఖాయం.













